26.6 C
Hyderabad
Monday, August 3, 2026

ఆలయ పూజారికి రెండు నెలల వేతనం అందజేసిన జగ్గా దంపతులు

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న పూజారికి రెండు నెలల వేతనాన్ని జగ్గా రజినీకాంత్ (గంగాధర్) – సంపూర్ణ దంపతులు తొలి ఏకాదశి సందర్భంగా శనివారం ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా వారు రూ.6 వేల నగదును ఆలయ కమిటీ నిర్వాహకులకు అందించి, ఆలయ అభివృద్ధికి తమవంతు సహకారం నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఆలయంలో ధూప, దీప, నైవేద్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగేందుకు సహకరించడంతో పాటు, నిత్యపూజలు నిర్వహిస్తున్న అర్చకులకు వేతనాలు అందించే విషయంలో కూడా కృషి చేస్తానని జగ్గా రజినీకాంత్ పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సదర్ పెద్దమనిషి తుమ్మల సత్యం, కమ్మరి పెద్ద గంగారం, జగ్గా రాము, పూజ్యం రవికుమార్, పాశం పెద్ద నరసయ్య, వై చిన్న గంగారం, తుమ్మల గంగారం తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article