ఆలయ పూజారికి రెండు నెలల వేతనం అందజేసిన జగ్గా దంపతులు
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న పూజారికి రెండు నెలల వేతనాన్ని జగ్గా రజినీకాంత్ (గంగాధర్) - సంపూర్ణ దంపతులు తొలి ఏకాదశి సందర్భంగా శనివారం ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా వారు రూ.6 వేల నగదును ఆలయ కమిటీ నిర్వాహకులకు అందించి, ఆలయ అభివృద్ధికి తమవంతు సహకారం నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఆలయంలో ధూప, దీప, నైవేద్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగేందుకు సహకరించడంతో పాటు, నిత్యపూజలు నిర్వహిస్తున్న అర్చకులకు వేతనాలు అందించే...