29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కేంద్రమంత్రి రాజీనామా విద్యార్థుల పోరాట విజయం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సీపీఐ మాస్ లైన్ పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నీట్ ప్రవేశ పరీక్ష లీకేజీకీ బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల పోరాట విజయమని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ అన్నారు. కోటగల్లిలోని ఎస్ఆర్ భవన్ లో శనివారం సీపీఐ మాస్ లైన్ పార్టీ నగర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ కేంద్రంగా జరిగిన విద్యార్థుల ఉద్యమానికి దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రజలు, ప్రజాసంఘాలు సంపూర్ణ మద్దతు తెలియజేశాయన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని హితవు పలికారు. ఎన్.టీ.ఏ ను వెంటనే రద్దు చేయాలన్నారు. నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతలను రాష్ట్రాలకు అప్పగించాలన్నారు. నీట్ లీకేజీ తో మనస్థాపం చెంది చనిపోయిన విద్యార్థులకు కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి పోరాటాలే మార్గమని ఈ విజయం మరోసారి నిరూపించిందన్నారు. ఈ ప్రెస్ మీట్ లో పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు కే.గణేష్ టీయూసీఐ జిల్లా నాయకులు బెల్లాల్ లింగం తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article