26.8 C
Hyderabad

ఆర్ ఎం ఓ సంతకం ఫోర్జరీ కలకలం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కల్యాణ లక్ష్మి కోసం నకిలీ వయస్సు సర్టిఫికెట్లు

 

భిక్కనూర్, బతుకమ్మ :

 

కళ్యాణ లక్ష్మి పథకం డబ్బుల కోసం రీజినల్ మెడికల్ ఆఫీసర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి వయస్సు సర్టిఫికెట్ తయారు చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లి వయసు కల్యాణ లక్ష్మి అప్లై చేసేందుకు కొందరు ఇంటర్నెట్ సెంటర్లు నిర్వాహకులు ఆర్ఎంవో సంతకం సీల్ ను నకిలీగా ముద్రించి వయసు సర్టిఫికెట్లు సిద్ధం చేస్తున్నారు. వీటిని అప్లికేషన్లతో జత చేసి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ విషయమై కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు అందడంతో భిక్కనూరుకు చెందిన ఒక జిరాక్స్ సెంటర్ యాజమాని ని గురువారం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.

More articles

Latest article