డిచ్ పల్లి, బతుకమ్మ :
తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ – I ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆమోద దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో దేశభక్తి భావనను పెంపొందించడం, జాతీయ జెండాపై గౌరవాన్ని పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ అపర్ణ, జాతీయ జెండా దేశ ఐక్యతకు, సమగ్రతకు ప్రతీక అని పేర్కొన్నారు. యువత దేశ విలువలను కాపాడటంలో కీలక పాత్ర పోషించాలని, ఎన్ఎస్ఎస్ ద్వారా దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఆమె సూచించారు. అతిథిగా పాల్గొన్న కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.రాంబాబు జాతీయ జెండా ఆమోద దినోత్సవం చారిత్రక ప్రాముఖ్యతను వివరించి, విద్యార్థులు క్రమశిక్షణతో, బాధ్యతతో దేశ గౌరవాన్ని కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ – యునిట్ I ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.శ్రీనివాస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి, డా. పున్నయ్య, డా. పాఠా నాగరాజు (డీన్, యుజిసి వ్యవహారాలు), డా.హలీమ్ (ప్రోగ్రామ్ ఆఫీసర్, ఎన్ఎస్ఎస్ యూనిట్ – II), డా. స్వామి రావు డా. దత్తహరి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చివరగా విద్యార్థులచే జాతీయ జెండాను గౌరవించాలని, దేశభక్తిని కాపాడాలని ప్రతిజ్ఞ చేయించారు.
