24 C
Hyderabad
Sunday, August 2, 2026

కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు పి.మహేష్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు పి.మహేష్ అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్ యూ) నిజామాబాద్ జిల్లా కమిటీ సమావేశం బుధవారం కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ 20 లక్షల మంది రాసిన నీట్ యూజీ పరీక్ష లీక్ కు గురి కావడంతో వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. విద్యార్థులు పిట్టల రాలిపోతున్న కనీసం కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పందించక పోవడంతో గత 20 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ కేంద్రంగా పోరాడి జులై 20న విద్యార్థులు పెద్ద ఎత్తున చలో పార్లమెంటు ను నిర్వహించారన్నారు. చలో పార్లమెంటు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసులను, కేంద్ర బలగాలను ఉపయోగించి విద్యార్థులను అమానుషంగా లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. బేటి బచావో బేటి పడావో అని నీతులు చెబుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థినులను దుస్తులు చింపడం, పిడి గుద్దులు గుద్దడం ఏ రకంగా సరైందని ప్రశ్నించారు. ప్రొటెస్ట్ మార్చ్ లో పాల్గొన్న విద్యార్థులకు కరెంట్ షాక్ ఇవ్వడం, భాష్ప వాయు గోళాలను ఉపయోగించడం దేశ సరిహద్దుల్లో ఉండే పారా మిలిటరీ బలగాలను విద్యార్థుల శాంతియుత ప్రదర్శన పై ప్రయోగించడం మోడీ ప్రభుత్వ దేశభక్త పాలనకు నిదర్శనమా అని దుయ్యబట్టారు. పర్యావరణవేత్త సోనం వాంగుచుకు, కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజిత్ దీప్కే నిరాహార దీక్ష సందర్భంగా కూడా పోలీసులు అమానుషంగా వ్యవహరించారన్నారు. విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం నుండి జవాబుదారితనం ఉండాలని, ఉన్నత విద్యారంగంలో అవినీతిని, కార్పొరేటీకరణ ను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారని, నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వారి న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న బిజెపి ఎంపీలకు ఏమాత్రం ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్న వెంటనే రాజీనామా చేయాలని కోరారు. 20 రోజులుగా ఢిల్లీ నడి బొడ్డుపై పోరాడుతున్న విద్యార్థులకు పీడీఎస్ యూ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు. విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ నిర్బంధకాండను  తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఆందోళన విరమింప చేయకుంటే రాష్ట్రంలో బిజెపి పార్టీ ప్రజా ప్రతినిధులను, కేంద్ర మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కమిటీ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.గౌతం కుమార్, జన్నారపు రాజేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎన్.కార్తీక్, సహాయ కార్యదర్శి ప్రిన్స్,జిల్లా కమిటీ సభ్యులు హుస్సేన్, మనోజ్, పవన్, భవాని,ఆకాష్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article