26.3 C
Hyderabad
Monday, August 3, 2026

బీఆర్ ఎస్ వి పసలేని ఆరోపణలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఉద్యోగాల భర్తీపై చర్చకు సిద్దం

 

. . . టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

ఉద్యోగాల భర్తీపై బీఆర్ఎస్ నేతల చేస్తున్న ప్రచారాలు పసలేనివని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలోని వినాయక మందిరంలో మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 70 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. లెక్కలతో సహా రికార్డులు ఉన్నాయని, ఇటీవల కాంగ్రెస్ పార్టీ పై సవాళ్ళు విసిరి బీఆర్ఎస్ నాయకులు తోక ముడిచారన్నారు. నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయంలో నీళ్ళు, నిధులు దోపిడి జరిగిందని, రెండున్నరేళ్ళలోనే కాళేశ్వరంకు బీటలు వారిందన్నారు. కాళేశ్వరంతో కాంట్రాక్టుల జేబులు నింపారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. నీటి విడుదల నిపుణుల సలహా, సూచన మేరకు ఉంటుందన్నారు. బీఆర్ఎస్ నేతలను తెలంగాణ ప్రజలు ఆదరించే స్థితిలో లేరని ఆయనన్నారు.

More articles

Latest article