29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, ప్రతి ఒక్కరూ తమ ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మంగళవారం సర్ పై సమీక్ష సమావేశం కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సర్ ప్రక్రియపై ప్రజల్లో అపోహలు తొలగిస్తూ, ముఖ్యంగా పేద ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. బూత్ లెవల్ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతి ఓటరు వివరాలను పరిశీలిస్తూ ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని ఆయన సూచించారు. నగర కార్పొరేటర్లు సమన్వయంతో పని చేసి, పార్టీ బలోపేతంతో పాటు ఓటర్లకు అవసరమైన సహాయం అందించాలని కోరారు. అదేవిధంగా సెక్యులర్ ఓట్ల పరిరక్షణ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు అందరూ ఐక్యంగా పనిచేయాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మేయర్ ఉమారాణి, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ, కార్పొరేషన్ చైర్మన్లు శేఖర్ గౌడ్, కేశ వేణు, తాహెర్ బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article