26.3 C
Hyderabad
Monday, August 3, 2026

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కాళేశ్వరం ప్రాజెక్టు తో లక్ష కోట్లు గోదావరిలో పోశారు

 

. . . టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

బీఆర్ఎస్ పదేళ్ళ రాబంధు పాలనలో ప్రజలు అష్టాకష్టాలు పడ్డారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పదేళ్ల పాలనపై రెండున్నర ఏళ్ల ప్రజాపాలన పై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో అంతా తానే నడిపిన కేసీఆర్ కాళేశ్వరాన్ని నిర్మించి వేల కోట్లు దోచుకున్నారన్నారు. కాళేశ్వరంలో నీళ్ళ పేరుతో దోపిడి జరిగిందన్నారు. ఒక చోట కట్టాల్సిన ప్రాజెక్టును మరోచోట కట్టి కమిషన్ల దందా చేసింది కేసీఆర్ కుటుంబమని, ప్రాజెక్టు కుంగిపోవడానికి వారే కారణం కాదా అని అన్నారు. అప్పట్లో ఇరిగేషన్ శాఖలో తప్పులకుక ద్ర బిందువు అయిన హరీష్ రావు ఈరోజు కరువు కరువు అంటూ ఏకరువు పెట్టడం దుర్మార్గమన్నారు. బీఆర్ఎస్ పాలనలో కేవలం కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని , ఎందరో నిరుద్యోగుల ఉసురుపోసుకున్న కేటీఆర్ కు మాట్లాడే అర్హత లేదని అన్నారు. ఉద్యోగాల పేరుతో కేటీఆర్ దొంగ ఏడుపు ఏడుస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ళలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ళు, మహిళలకు ఉచిత బస్సు హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళ్తున్నామన్నారు. నియోజకవర్గానికి మూడు వేలకు పైగా ఇళ్ళు ఇచ్చామని, ఇందిరమ్మ ఇళ్ళతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. విద్య వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. రూ.20 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేశామన్నారు. ఉద్యోగాల గురించి బీజేపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రైవేట్ ఆస్తుల సొత్తును దోచుకోవాలని ఓ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని, దొంగల్లా మాట్లాడుతూన్నారన్నారు. సర్ పేరుతో నానాయగి చేస్తున్నారని, పేదవాడి ఓటు తొలగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఓటు విలువ ప్రామాణికమని, కాంగ్రెస్ పార్టీ ఓట్ల ను తొలగించే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నామన్నారు. బాల్కొండలో అభివృద్ది జరుగలేదని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పసలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. మాదవనగర్ ఆర్వోబి పనులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జరుగుతున్నాయని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్రం తరపున అందాల్సిన నిధులు త్వరలోనే అందుతాయని, తద్వారా ఆర్ వోబి పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article