30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . టీటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శ కాంబ్లే గోపాల్

 

జుక్కల్, బతుకమ్మ :

 

పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని టిటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాంబ్లే గోపాల్ అన్నారు. ఈ మేరకు ఆగస్టు 23న నిర్వహించనున్న జనజాగరణ యాత్ర పోస్టర్లను మంగళవారం జుక్కల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆవిష్కరించారు. టిటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు హన్మంత్ రెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పోస్టర్లను ఆవిష్కరించి, హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, 52 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ, డీఏలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి తిరుపతయ్య, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సుంకరి శ్రీనివాస్, వై. జనార్ధన్, కే.సాయిలు, జైచంద్, సునీల్, సంతోష్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

More articles

Latest article