24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఏర్గట్లలో బీజేపీ నాయకుల అరెస్టు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పోలీసుల చర్యపై పార్టీ నేతల ఆగ్రహం

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఏర్గట్ల మండలానికి చెందిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేయడంపై పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మండల బీజేపీ అధ్యక్షుడు తోర్తి గంగారెడ్డి మాట్లాడుతూ, ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసం ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేయకుండా, బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మాజీ ఏర్గట్ల మండల బీజేపీ అధ్యక్షుడు గుమ్మిర్యాల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, అధికారంలో ఉన్నామనే కారణంతో పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేయడం సరికాదని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలకు సమాన న్యాయం జరగాలని ఆయన అన్నారు. ఈ ఘటనలో ఏర్గట్ల పోలీసులు మండల బీజేపీ అధ్యక్షుడు తోర్తి గంగారెడ్డి, మాజీ అధ్యక్షుడు గుమ్మిర్యాల నారాయణ రెడ్డితో పాటు బూత్ కమిటీ సభ్యులు గుండ విట్టల్, జక్కని వంశీ, పడ్కంటి నరసారెడ్డిలను అరెస్టు చేసినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. అరెస్టులపై బీజేపీ నేతలు పోలీసుల తీరును ఖండిస్తూ, ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.

More articles

Latest article