24.7 C
Hyderabad
Monday, August 3, 2026

కాలుష్యం కొరలో 10 గ్రామాలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఫార్మా కంపెనీ ఇష్టరాజ్యం – అధికారులు మౌనం

 

. . . రాత్రివేళ ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందని ప్రజలు ఆవేదన

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

పచ్చని పల్లెలను కాలుష్యం చుట్టూ ముడుతోంది. భిక్కనూరు మండల కేంద్రంలోని ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ నుంచి సాయంత్రం, రాత్రి వేళలో యదేచ్చగా విషవాయువులు విడుదలవుతున్నాయని దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  స్థానికుల కథనం ప్రకారం…. నిబంధనలకు విరుద్ధంగా కంపెనీ యాజమాన్యం రాత్రిపూట రియాక్టర్ల నుండి విషపూరిత వాయువులను గాల్లోకి వదులుతుంది. దీనివల్ల ఎంఎస్ఎన్ కంపెనీ చుట్టూ రెండు నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలోని బస్వాపూర్, సిద్ధ రామేశ్వర్ నగర్, భిక్కనూరు, పెద్ద మల్లారెడ్డి, కాచాపూర్, అంతంపల్లి, లక్ష్మీ దేవునిపల్లి, అయ్యవారిపల్లి, కంచర్ల, మల్లుపల్లి తదితర 10 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి అయ్యే సరికి కళ్ళు మండుతున్నాయి. ఊపిరాడదు. పిల్లలు, వృద్ధులు దగ్గు ఉబ్బసంతో బాధపడుతున్నారు. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

. . . కార్మికుల పరిస్థితి దారుణం

కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు సరైన సేఫ్టీ పరికరాలు లేకుండానే పనిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం రియాక్టర్లు పేలి కార్మికులకు గాయాలైన యాజమాన్యం నష్టపరిహారం కానీ సరైన వైద్యం కానీ అందించడం లేదని కార్మికుల వాపోతున్నారు. వ్యాపారమే ధ్యేయంగా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వారు ఆరోపించారు.

. . . అధికారులు పట్టించుకోవడం లేదు

ఈ విషయమై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు మండిపడుతున్నారు. కాలుష్యం నియంత్రణ మండలి రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ఎంఎస్ఎన్ కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని రాత్రిపూట విషవాయువుల విడుదల నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని హెచ్చరిస్తున్నారు.

యాజమాన్యం పట్టించుకోవడం లేదు : సిద్దు, వార్డు మెంబర్

రాత్రిపూట విషవాయువులను వదిలివేయడం వల్ల మా గ్రామంలో ఊపిరాడడం లేదని కంపెనీ యాజమాన్యంనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదన్నారు. సంబంధిత అధికారులు కంపెనీపై చర్యలు తీసుకోవాలి.

 

10 villages in the grip of pollution

 

మా గ్రామాన్ని కాపాడాలి : పవన్ కళ్యాణ్, వార్డు మెంబర్

కాలుష్యం నియంత్రణ మండలి మరియు రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకొని విషవాయువులను వదలకుండా చూడాలని మా గ్రామాన్ని కాపాడాలని అధికారులను వేడుకుంటున్నాను.

 

10 villages in the grip of pollution

More articles

Latest article