బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : ఎంతోమంది దివ్యాంగ విద్యార్థులకు బాసటగా నిలుస్తూ జీవితంలో ఉన్నత స్థానాలకు అలాగే ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిర పరుస్తున్న ఏకైక నిలయం స్నేహ సొసైటీ అని సంక్షేమ శాఖ అధికారిని రసూల్ బి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ మానసిక దివ్యాంగుల పాఠశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి, అలాగే మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ హాజరయ్యారు.ఈ సందర్బంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి మాట్లాడుతూ ప్రతి ఒక్క జీవికి భగవంతుడు ఒకేలా తెలివితేటలు ఆరోగ్యాన్ని అందిస్తారని తెలిపారు. ప్రతి జీవిలో సైతం మెదడు అనేది చాలా కీలకంగా పనిచేస్తుందని వారు తెలిపారు. శరీరంలో ఏ పని జరగాలన్న మెదడు ద్వారా నాడీ వ్యవస్థ ఆరోగ్య సంరక్షణ పనులు జరుగుతాయని తెలిపారు. అయితే కొన్ని సందర్భాల్లో తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు అనవసరమైన ఆహార పదార్థాలు అలాగే వారు ఉండే విధానం అలవాట్ల ప్రకారంగా పిల్లలపై ప్రభావం చూపుతుందని చెప్పారు. జిల్లా కేంద్రంలో ఉన్న స్నేహా సొసైటీ లో ఉన్న దివ్యాంగ, అంద పిల్లలు చదువుకొని ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో సైతం నియామకమైన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో సైతం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా స్నేహ సొసైటీలో పని చేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం పొందరని గుర్తు చేశారు. మానసిక దివ్యంగా విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న స్నేహ సొసైటీ ఉపాధ్యాయ బృందాన్ని వారు అభినందించారు. అలాగే మానసిక వైద్య నిపుణులు రవితేజ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలు మానసిక దివ్యంగులైనప్పటికీ మామూలుగా ఉన్నప్పటికీ కూడా వారి ప్రవర్తన గమనించి వారికి అనుకూలంగా వారిని ఏ విధంగా ప్రేమతో మార్చుకునే విధంగా వారికి తెలియకుండానే వారి విధానంలో వెళ్లి వారు చేస్తున్న తప్పును వారు తెలుసుకునేలా చేయడం ద్వారా పిల్లల భవిష్యత్ బంగారు మాయంగా తీర్చిదిద్దడం సాధ్యమని వారు తెలిపారు. పిల్లల పట్ల నిర్లక్ష్యం వహిస్తే వారి భవిష్యత్తు అంధకారంగా మారడానికి కూడా తల్లిదండ్రుల కార్యక్రమం ఉంటుందని అన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా సంక్షేమ అధికారిని, వైద్య నిపుణులను పలువురు భక్తులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ కార్యదర్శి ఎస్. సిద్దయ్య,దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, సోషల్ వర్కర్ సంధ్య, స్నేహ సొసైటీ సిబ్బంది,మానసిక దివ్యంగా, అంద విద్యార్థులు పాల్గొన్నారు.

