నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
జి.జి. కళాశాలకు కేటాయించబడిన 1860 సీట్లకు గాను, 1493 మంది విద్యార్థులు తుది ప్రవేశం పొందారని, 367 సీట్లు ఖాళీలు ఏర్పడ్డాయని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.రామ్ మోహన్ రెడ్డి తెలిపారు. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఇప్పటివరకు వివిధ కోర్సులలో మిగిలిన సీట్ల వివరాలను ప్రిన్సిపాల్ తెలియజేశారు. బి.ఏ. తె.మీ. 7, రెగ్యులర్ 44, రిస్ట్రక్చర్ పబ్లిక్ పాలసీగవర్నెన్స్ లో 15 మొత్తం బి.ఏ.లో 480 కి గాను, 66 సీట్లు ఖాళీలు ఏర్పడ్డాయి. ఉపాధి ఆధారిత (ఏఈడీపీ) కోర్సులు బీకాం విభాగంలో బీ.ఎఫ్.ఎస్.ఐ. 2, సైన్స్ విభాగంలో హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ 17, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కోర్సుల్లో 9, ఈ మూడు (ఏఈడీపీ) కోర్సుల్లో మొత్తం 180 సీట్లకు గాను 28 సీట్లు ఖాళీలు ఏర్పడ్డాయి. బి.కాం.లో ఫినాన్స్ 16, టాక్సేషన్ 24, అనాలైటిక్స్ 23, బి.బి.ఏ. 9, మొత్తం 480 కి గాను 72 సీట్లు ఖాళీలు ఏర్పడ్డాయి. బీఎస్సీ లైఫ్ సైన్స్ లో 94, ఫిజికల్ సైన్స్ 80, హానర్స్ 27, మొత్తం బీఎస్సీలో 720 గాను 201 సీట్లు ఖాళీలు ఏర్పడ్డాయనీ, దోస్త్ స్పెషల్ ఫేస్ ద్వారా జూలై 20 నుండి 26 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని, ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం ఉంది. విద్యార్థులు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు. తుది కేటాయింపు తర్వాత తమ ఒరిజినల్ సరిటిఫికేట్స్ తో పాటు, జిరాక్స్ కాపీలు తీసుకొని కళాశాలకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎస్. రంగరత్నం, అడ్మిషన్ కన్వీనర్లు రమేష్ గౌడ్, రామస్వామి, దండు స్వామి, రంజిత, ఉమాకిరణ్, జయ ప్రసాద్, నహీదా బేగం, రాజేశ్, రామక్రిష్ణ, కిరణ్ కుమార్ గౌడ్, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.
