30.9 C
Hyderabad
Monday, August 3, 2026

న్యాయవాదుల సంక్షేమ సాధనలో ప్రథమున్ని అవుతా

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు చలకాని వెంకట్ యాదవ్

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :

 

న్యాయవాదుల ప్రేమాభిమానాలు ఓట్ల రూపంలో కురియడంతోనే తాను తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైనట్లు హైకోర్టు సీనియర్ న్యాయవాది చలకాని వెంకట్ యాదవ్ అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది జక్కుల వెంకటేష్వర్, నగర పాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ ముత్యాల శ్యామ్ బాబు హైదరాబాద్ లోని తన కార్యాలయంలో కలిసి మెమెంటో, శాలువతో శుభాకాంక్షలు తెలిపి పలు న్యాయవాదుల అంశాలు వారు ప్రస్తావించిన నేపథ్యంలో యాదవ్ మాట్లాడారు.గతంలోనేవలె మొన్నటి బార్ కౌన్సిల్ ఎన్నికలలో కూడా మద్దతుగా నిలబడి గెలుపులో కీలకంగా నిలిచినందుకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా న్యాయవాదులు ఎప్పటికి తన మనసులో ప్రత్యేక స్థానం ఉంటుందని ఆయన తెలిపారు. న్యాయవాదుల సంక్షేమ సాధనలో ప్రథముడిగా నిలుస్తానని పేర్కొన్నారు.న్యాయవాదుల రక్షణ చట్టం ద్వారా ఒక రక్షణ కవచం ఏర్పడిందని, మరిన్ని రక్షణలు పండుపర్చబడవలసిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు.తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎనలేని త్యాగాలు చేసిన వారికి ప్రభుత్వపరంగా సముచిత ప్రధాన్యం లభించవలసి ఉన్నదని అందుకు తనవంతుగా శ్రమిస్తానని వెంకట్ యాదవ్ తెలియజేశారు.

More articles

Latest article