రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన కామారెడ్డి పోలీసులు

0 10,245

 

. . . వివిధ క్రీడల్లో ఆరు పతకాలు

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ – 2026 పోటీల్లో కామారెడ్డి జిల్లా పోలీసులు విశేష ప్రతిభ కనబరిచారు. వివిధ క్రీడా విభాగాల్లో పోటీపడి ఒక స్వర్ణ పతకం, రెండు రజత పతకాలు, మూడు కాంస్య పతకాలు సాధించి మొత్తం ఆరు పతకాలతో జిల్లా పోలీసు శాఖకు గర్వకారణంగా నిలిచారు. ఈ విజయంతో జిల్లా పోలీసు శాఖలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలను జిల్లా ఎస్పీ అభినందించి, రాష్ట్ర స్థాయిలో సాధించిన విజయాన్ని జాతీయ స్థాయిలోనూ కొనసాగించాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తూ జిల్లా పోలీసుల ప్రతిష్ఠను మరింత పెంచాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా విజేతల కృషిని ప్రశంసించిన అధికారులు, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

 

Kamareddy police demonstrate excellence at the state level.

Leave A Reply

Your email address will not be published.