25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

వర్షాలు కురవాలని గ్రామదేవతలకు గోదావరి నీళ్లతో అభిషేకాలు

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు వర్షాలు కురవాలని శుక్రవారం గ్రామదేవతలకు గోదావరి నది నీళ్ళు తీసుకువచ్చి అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు పట్ల సురేష్, మాజీ జెడ్పిటిసి నారోజి గంగారం, సర్పంచ్ కృష్ణ, టి.దత్తాత్రి, సంతోష్, కుర్మాజి గంగారం, కృష్ణకాంత్, గ్రామస్తులు పాల్గొన్నారు.

More articles

Latest article