30.9 C
Hyderabad
Monday, August 3, 2026

అన్ని వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సంఘ భవనాలకు రూ.10 లక్షల ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం డిచ్ పల్లి మండలం ముల్లంగి గ్రామంలో మున్నూరుకాపు, రెడ్డి సంఘం భవనాలకు రూ. 5 లక్షల చొప్పున రెండు భవనాలకు రూ.10 లక్షల ప్రొసీడింగ్స్ పత్రాన్ని ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేసిన సదరు సంఘం సభ్యులు, పార్టీ నాయకులు ఎమ్మెల్యేను శాలువతో సత్కరించి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ అశోక్, ఏఎంసీ డైరెక్టర్ గంగారెడ్డి, మధుసూదన్, మున్నూరు కాపు, రెడ్డి సంఘం ప్రతినిధులు ఎల్లారెడ్డి, సాయరెడ్డి, మల్లారెడ్డి, నారాయణ, అబ్బయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article