27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట కమిటి వినతి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సిపిఎస్ నుండి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్

 

హైదరబాద్, బతుకమ్మ :

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఎస్ అమలు తేదీ అయిన కంటే ముందే నియామక నోటిఫికేషన్లు విడుదలై ఆ తర్వాత నియామకాలు పొంది ప్రస్తుతం కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంలో కొనసాగుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని (ఓపిఎస్) వర్తింపజేయాలని 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట కమిటీ తెలంగాణ రాష్ట్రం ప్రతినిధుల బృందం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వినతిపత్రాన్ని సమర్పించింది. గురువారం సచివాలంలో 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట కమిట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాడవేడి వినోద్ కుమార్ ప్రధాన కార్యదర్శి ఇమ్మడి సంతోష్ కుమార్ కోశాధికారి గుంటి వేణుగోపాల్ రాష్ట్ర ముఖ్య సలహాదారు రేండ్ల రాజేష్ తెలంగాణ గ్రూప్  అసోసియేషన్ అధ్యక్షుడు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ తెలంగాణ సచివాలయం అధికారులు స్వామి గౌడ్ జే. వినోద్ ఎం తిరుపతి సంఘ ఇతర కార్యవర్గ సభ్యులు ఈ బృందంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లు విడుదలయి ఆ తర్వాత ఆలస్యంగా జాయిన్ అయిన వారికి పాత పెన్షన్ పరిధిలోకి తీసుకువచ్చే అవకాశాన్ని కల్పించిందని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం  చట్టం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ మార్పులను అనుసరించాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా 2004 కంటే ముందు నోటిఫికేషన్లు విడుదలయి ఆ తర్వాత నియామకాలు జరిగి సిపిఎస్ విధానంలో నష్టపోతున్న ఉద్యోగులందరినీ మానవీయ కోణంలో ఆలోచించి ఓపిఎస్ పరిధిలోకి తీసుకువచ్చేలా ముఖ్యమంత్రి తో ప్రతినిధ్యం వహించి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ని కమిటీ నాయకులు ఉద్యమాల సుదీర్ఘ పోరాట నేపథ్యాన్ని వివరిస్తూ విజ్ఞప్తి చేశారు.

 

Representation by the Employees and Teachers' Old Pension Struggle Committee to the Chief Secretary of the Telangana Government.

More articles

Latest article