29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

న్యూసెన్స్ చేసిన వ్యక్తికి రెండు రోజుల జైలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: న్యూసెన్స్ చేసిన వ్యక్తికి న్యాయ స్థానం రెండు రోజుల జైలు జైలు శిక్ష విధించింది. మూడో టౌన్ ఎస్ హెచ్ వో మహేశ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని హమాల్ వాడీకి చెందిన సంఘి రమేశ్ వర్మ (52) తన తమ్ముడి భార్యతో ఆదివారం గొడవపడి న్యూసెన్స్ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రమేశ్ పై కేసు నమోదు చేసి రమేశ్ వర్మను సోమవారం మార్నింగ్ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రెండు రోజుల జైలు శిక్ష విధించారు. మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా న్యూసెన్స్ చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని ఎస్ హెచ్ వో స్పష్టం చేశారు.

More articles

Latest article