27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

కిరాతకుడు రాజ్ కుమార్ ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పెంజర్లలో పురుగుల మందు తాగి బలవన్మరణం

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

తనపై పోక్సో కేసు పెట్టారని కక్షతో ఆరుగురిని హత్య చేసిన కిరాతకుడు రాజ్ కుమార్ అత్మహత్యకు పాల్పడ్డారు. షాధ్ నగర్ పరిధిలోని కోత్తుర్ మండలం పంజర్ల గ్రామ శివారులో రాజ్ కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడినట్లు సోమవారం గుర్తించారు స్థానికులు.

 

Murderer Raj Kumar commits suicide

 

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మోస్ట్ వాంటేడ్ రాజ్ కుమార్ డెడ్ బాడిగా నిర్ధారించారు. మృతదేహం పక్కనే పురుగుల మందు బాటిల్ లభ్యం అవ్వడంతో రాజ్ కుమార్ బలవన్మరణానికి పాల్పడినట్లయింది. దైవాల గూడలో మైనర్ బాలికతో పాటు ఆమే తల్లి లక్ష్మి, అమ్మమ్మ రుక్మమ్మతో పాటు తన బార్య సరిత, ఇద్దరు కొడుకులను రాజ్ కుమార్ కిరాతకంగా హత్య చేసి పరారీ అయిన విషయం తెలిసిందే. రాజ్ కుమార్ ను పట్టుకునేందుకు ప్యూచర్ సిటి పోలీసులు 12 టీంలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టిన విషయం విదితమే. అదే సమయంలో పోలీసు శాఖ నరమేదం జరిపిన కిరాతకుడు రాజ్ కుమార్ ఆచూకి తెలిపిన వారికి 2 లక్షల రివార్డును ప్రకటించారు. రెండు రోజులుగా సోషల్ మీడియాలో రాజ్ కుమార్ పలానా ప్రాంతంలో కనిపించాడని, పోలీసులకు దొరికాడని ప్రచారం జరిగింది. కొందరైతే రాజ్ కుమార్ ను ఎన్ కౌంటర్ చేస్తారని వదంతులు కూడా చేశారు. పోలీసులు తీవ్ర గాలింపు నేపథ్యంలో ఎలాగైన పోలీసులు పట్టుకుంటారని చివరకు తన మేనమామా ఊరులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు రాజ్ కుమార్ అని పోలీసులు భావిస్తున్నారు.

 

Murderer Raj Kumar commits suicide

More articles

Latest article