. . . ప్రకటించిన పోలీస్ శాఖ
హైదరాబాద్, బతుకమ్మ :
షాబాద్ మండలం దైవాల గూడలో ఆరుగురిని హత్య చేసి పరారీలో ఉన్న నిందితుడు రాజ్‌కుమార్ ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల నగదు రివార్డు అందజేస్తామని పోలీసులు ప్రకటించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. రాజ్‌కుమార్ ఆచూకీ లేదా అతనికి సంబంధించిన కీలక సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్ శాఖ, తెలంగాణ సీఎంవో నుంచి నిందితుడిపై రివార్డు ప్రకటన విడుదలైంది. కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు, నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలతో చర్యలు కొనసాగిస్తున్నారు.

