రాజ్ కుమార్ ఆచూకి తెలిపిన వారికి రూ.2 లక్షల రివార్డ్
. . . ప్రకటించిన పోలీస్ శాఖ హైదరాబాద్, బతుకమ్మ : షాబాద్ మండలం దైవాల గూడలో ఆరుగురిని హత్య చేసి పరారీలో ఉన్న నిందితుడు రాజ్‌కుమార్ ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల నగదు రివార్డు అందజేస్తామని పోలీసులు ప్రకటించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. రాజ్‌కుమార్ ఆచూకీ లేదా అతనికి సంబంధించిన కీలక సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని...