27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జాతీయవాదమే భారతజాతికి శ్రీరామరక్ష

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :

 

న్యాయవాద సమాజంలో జాతీయవాదాన్ని పెంపొందించడానికి అవిరళ శ్రమిస్తున్నట్లు న్యాయవాద పరిషత్ రాష్ట్ర కోశాధికారి హైకోర్టు న్యాయవాది మంగులాల్ అన్నారు. నిజామాబాద్ జిల్లా న్యాయవాద పరిషత్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగిచారు. ఇండియన్ పినల్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో నూతన చట్టాలకు ప్రధాన మంత్రి మోడీ నాయకత్వంలో రూపకల్పన జరిగిందని ఆయన తెలిపారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అనే మూడు భారత మూలాలు ఉన్న చట్టాలు దేశ గొప్పతనాన్ని చాటుతున్నాయని తెలిపారు. దేశ గొప్పతనం చట్టాలలోనే ఉన్నదని ఆయన అన్నారు. న్యాయవాదులకు న్యాయ విజ్ఞానం అందిచడంలో న్యాయవాద పరిషత్ కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రతి రంగంలో భారతీయ మూలాలు నింపడమే నినాదంగా పరిషత్ పని విధానం ఉన్నదని అన్నారు. న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ పరిషత్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు న్యాయవాదుల సంక్షేమం కోసం సామాజిక బాధ్యత గా పని చేస్తున్నదని తెలిపారు. సమావేశంలో పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండారి కృష్ణనంద్, జిల్లా కార్యదర్శి  డి. నరేందర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేధార్, సాయి రెడ్, గంగా ప్రసాద్, సుదర్శన్ రెడ్డి, మాణిక్ రాజు, విగ్నేష్, బిట్ల రవి, మద్దేపల్లి శంకర్, ఉదయ కృష్ణ, పిల్లి శ్రీకాంత్, శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article