జాతీయవాదమే భారతజాతికి శ్రీరామరక్ష
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : న్యాయవాద సమాజంలో జాతీయవాదాన్ని పెంపొందించడానికి అవిరళ శ్రమిస్తున్నట్లు న్యాయవాద పరిషత్ రాష్ట్ర కోశాధికారి హైకోర్టు న్యాయవాది మంగులాల్ అన్నారు. నిజామాబాద్ జిల్లా న్యాయవాద పరిషత్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగిచారు. ఇండియన్ పినల్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో నూతన చట్టాలకు ప్రధాన మంత్రి మోడీ నాయకత్వంలో రూపకల్పన జరిగిందని ఆయన తెలిపారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా...