28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

 

ముప్కాల్, బతుకమ్మ :

 

ముప్కాల్ మండలం నల్లూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం నర్సరీ నుండి యూకేజీ వరకు చదువుతున్న చిన్నారులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ బ్యాగులు, పెన్సిల్లు, రబ్బర్లు, షార్పనర్లు పంపిణీ చేశారు. అలాగే 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, జ్యామెట్రీ బాక్సులు, పెన్సిల్లు, ఎరేజర్లు, షార్పనర్లు అందజేశారు. ఈ సేవా కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ పెండం జీవన్, వారి సతీమణి సరోజా, అలాగే వారి కుమారుడు ప్రదీప్ కుమార్ సతీమణి మేధా దాతలుగా వ్యవహరించి, గ్రామంలోని పిల్లలందరికీ సుమారు రూ.80 వేల రూపాయల విలువైన విద్యా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగాధర్, ఉపసర్పంచ్ లావణ్య, శ్రీనివాస్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు బర్కం గంగాధర్, శ్రీనివాస్, వార్డు సభ్యులు ప్రవీణ్ కుమార్, పనిందర్ గౌడ్, రాజు, జీపీవో సురేష్, ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్, ఉపాధ్యాయులు నవీన, జ్యోత్స్న, నాగరాణి, కవిత, లక్ష్మి, సౌజన్య, శ్రీజ, అటెండర్ అనుజ లింగం, అంగన్వాడీ సిబ్బంది ముత్తెమ్మ, పూజ, పాఠశాల వంట సిబ్బంది మమత, రజిత, పిల్లల తల్లిదండ్రులు, శ్రీనివాస్, రాజు, సునీల్, నవకాంత్, చిన్నయ్య, వసంత్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article