26.3 C
Hyderabad
Monday, August 3, 2026

వచ్చే ఏడు కోటి మొక్కలు నాటుతాం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మంత్రి సీతక్క పుట్టిన రోజున సెర్ప్ సిబ్బంది తీర్మానం

 

. . . శుక్రవారం పలుజిల్లాల్లో మొక్కలు నాటి ప్రతిజ్ఞ చేసిన సెర్ప్ సిబ్బంది

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి పారుదల శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ సెర్ప్ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు రాష్ట్ర నాయకులు కుంట గంగాధర్, ఏపూరి నర్సయ్య లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మొక్కలు నాటి సంబరాలు చేసుకున్నారు. జిల్లాలోని గోవింద్ పేట లో భీమ్ గల్ ఐకెపి ఏపీయం ప్రమీల ఇంటి ముందు సీసీ రఘుపతి తో కలసి సెర్ప్ ఏపీఏం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్ మొక్కను నాటి సంబరాలు చేసుకున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ లో సెర్ప్ సీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎపూరి నర్సయ్య మొక్కను నాటారు. నాగర్ కర్నూల్, జగిత్యాల, కరీంనగర్, మెదక్ జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ నాయకులు, సిబ్బంది మొక్కలు నాటారు.

 

We will plant ten million saplings next year.

 

ఈ సందర్బంగా రాష్ట్ర నాయకులు కుంట గంగాధర్, ఏపూరి నర్సయ్యలు మాట్లాడుతూ సెర్ప్ ఉద్యోగులకు పెస్కెల్ వర్తింపు చేసినప్పటికీ 3974 ఉద్యోగులకు క్యాడర్స్ తక్కువ చేసి ఇచ్చారని అందుకే అందరికీ రెండు క్యాడర్స్ పెంపు చేయాలని సిఎం రేవంత్ రెడ్డికి స్టేట్ జేఏసీ తరఫున విన్నావించగా సానుకూలంగా స్పందించారన్నారు. సంబంధిత లెటర్ ఎండార్స్ చేసి పంపారన్నారని, బదులుగా సీఈఓ దివ్యా దేవరాజన్ ఐఏఎస్ పంపిన ప్రతిపాదనల దస్త్రం ఆర్థిక శాఖ లో ఉందన్నారు. అలాగే సర్వీస్ రూల్స్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందన్నారు. పోస్టుల పెంపు, రిక్రూట్ మెంట్ చేయాల్సి ఉందని అన్నారు. తొందరలోనే స్టేట్ జేఏసీ నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి వినతులు పరిష్కారం చేస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. మంత్రి సీతక్క పుట్టిన రోజు సందర్భంగా కేక్ లు, స్వీట్లు వంటి వృధా ఖర్చులు కాకుండా ప్రకృతి పరిరక్షణ కోసం మొక్కలు నాటాలన్న దివ్య ఐఏఎస్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు యూనియన్ నాయకులు పలు చోట్ల మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. వచ్చే ఏడాది ఇదే రోజున 50 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలు, సిబ్బంది కలిసి తలా 2 మొక్కల చొప్పున మొత్తం కోటి మొక్కలు మంత్రి సీతక్క పుట్టిన రోజున నాటి తమ డిమాండ్లు నెరవేర్చినందుకు కృతజ్ఞత చెప్పాలని ఈరోజు తిర్మాణించామన్నారు.

 

We will plant ten million saplings next year.

More articles

Latest article