24 C
Hyderabad
Sunday, August 2, 2026

నందిగల్లీలో అబ్కారీ అధికారుల దాడులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . గంజాయి స్మగ్లర్ పట్టివేత

 

. . . మరో ముగ్గురు సహాయకుల బైండోవార్

 

భీమ్ గల్, బతుకమ్మ :

 

మండల కేంద్రంలోని నందిగల్లీలో స్థానిక అబ్కారీ అధికారులు ఆకస్మిక దాడులను నిర్వహించారు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు జరిపిన ఈ దాడిలో ఛత్తిస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన మేడే లకమాయే అనే గంజాయి స్మగ్లర్ ను అధికారులు అరెస్ట్ చేశారు. స్మగ్లర్ తో పాటు నివసిస్తున్న మరో ముగ్గురు నిధితులను స్థానిక తహసీల్దార్ ముందు బైండోవార్ చేశారు. ఈ దాడిలో నిందితులు నివసిస్తున్న ఇంట్లో 116 గ్రాముల ఎండు గంజాయి పొడిని అధికారులు స్వాదీనం చేసుకొన్నారు. భవన నిర్మాణ కార్మికునిగా భీమ్ గల్ కు వచ్చిన నిందితులు తాము ఛత్తిస్ ఘడ్ కెళ్ళి తెచ్చిన గంజాయిని చిన్న ప్యాకెట్ లు చేసి రూ. 500 కు ఒకటి అమ్ముతున్నట్లు తమ విచారణలో వెల్లడి అయినట్లు అబ్కారీ అధికారులు తెలిపారు. ఈ మెరుపు దాడిలో భీమ్ గల్ అబ్కారీ సీ ఐ పి. వేణు మాధవ్, ఎస్సై కె. గోవర్ధన్, కానిస్టేబుళ్ళు సాయన్న, దేవేందర్, బి. చంద్ర శేఖర్, వాహిదొద్దీన్ లు పాల్గొన్నారు.

 

Excise officials' raids in Nandigalli

More articles

Latest article