ఓటరు వివరాలను అందరు విధిగా అందజేయాలి

0 9,891

 

. . . స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ మానాల

 

కమ్మర్ పల్లి, బతుకమ్మ :

 

ప్రతి ఒక్క ఓటరు తన ఓటరు వివరాలను ఈ నెల 24 లోపు ఎస్ ఐ ఆర్ ఫాం తో తప్పక సమర్పించాలని స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి కోరారు. గురువారం ఆయన తన ఓటరు వివరాలను స్వయంగా స్థానిక తహసీల్దార్ నరేష్ కు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఎస్ ఐ ఆర్ లో భాగంగా మన వివరాలను అందజేయడం వల్ల భవిష్యత్ లో మన ఓటు గల్లంతు కాకుండా సురక్షితంగా ఉంటుందన్నారు. స్థానిక బీఎల్ ఓ లు, ఈ ఎస్ ఐ ఆర్ లో ఎవ్వరు మిస్ కాకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమం లో బీ ఎల్ ఓ సూపర్ వైజర్ శరత్, శ్రీనివాస్ రెడ్డి, సుంకేట రవి లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.