. . . పట్టించుకోని సర్పంచ్ భర్త
. . . గత మూడు రోజులుగా త్రాగునీరు లేక ప్రజల ఇబ్బందులు
ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండల కేంద్రంలోని గంగారం తండా గ్రామపంచాయతీ పరిధిలోని ప్రధాన వీధులలో తాగునీటి కటకట విపరీతంగా మొదలైంది. ఎండాకాలంలో లేని త్రాగునీటి కటకట వర్షాకాలంలో మొదలుకోవడంతో స్థానికులు సర్పంచ్ సంగీత కు సమస్య పరిష్కారం కోసం ఫిర్యాదు చేశారు. కానీ సర్పంచ్ సంగీత భర్త దిలీప్ కుమార్ జోక్యం చేసుకొని తమకు గంగారాం తాండాలోని జ్ఞాన వాగ్దేవి విశ్వ విద్యాలయం తమ పరిధిలోకి రాదని ఇందల్వాయి గ్రామ సర్పంచ్ గంగమని ని సంప్రదించాలని ఉచిత సలహాలు ఇస్తూ తాగునీటి కటకటను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గంగారం తండాకు చెందిన పలువురు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు రాక ప్రజలు అల్లాడుతున్న కనీస పరిజ్ఞానం లేకుండా వ్యవహరించడంతో సర్పంచ్ సంగీత పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ స్థానిక సర్పంచ్ సంగీత స్థానికంగా నివాసం ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి నిజామాబాదులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని స్వయంగా గంగారం తండాకు చెందిన వార్డు సభ్యులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గెజిట్ ప్రకారం గంగారం తండా గ్రామ పంచాయతీకి తమ తమ నివాస గృహాలు ఉన్నప్పటికీ ఓట్లు మాత్రం ఇందల్వాయి గ్రామంలో ఉండడంతో తమ గ్రామంలో మీ ఓటు లేవని సాకులు చెబుతూ తాగునీటికి కటకట సృష్టిస్తున్నాడని పలువురు అంబేద్కర్ కాలనీకి చెందిన దళితులు ఆరోపిస్తున్నారు. గంగారం తాండ తో పాటు తిరుమల గ్రామాలలో సైతం తాగునీటి కటకట మొదలైందని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ నీరు పైనుంచే రావడం లేదని కుంటి సాకులు చెబుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని తాండా ప్రజలు గ్రామస్తులు కోరుతున్నారు. వాస్తవానికి గత మూడు రోజులుగా నీరు రాకపోతే తాత్కాలిక పరిష్కారం కోసం వాటర్ ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేయాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శి తో పాటు సర్పంచ్ పై ఉందని ఎంపీడీవో అనంత్ రావు వెల్లడించారు. తక్షణమే జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని త్రాగునీటి కటకటను రూపుమాపాలని తాత్కాలిక పరిష్కారం చూపి తమను ఆదుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
