26.2 C
Hyderabad
Monday, August 3, 2026

సర్ ప్రక్రియ లో అర్హత గల ఓటరు ఓటు హక్కును కోల్పోకూడదు

Must read

📰 Generate e-Paper Clip

 

 

. . . కార్పొరేటర్లకు దిశ నిర్దేశం చేసిన ఎంపీ అర్వింద్

 

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

 

సర్ ప్రక్రియ సమయంలో ఏ అర్హత గల ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పో కూడదని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి అన్నారు. గురువారం ఎంపీ క్యాంప్ కార్యాలయంలో సర్ పై కార్పొరేటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ… సర్ పై ప్రతి డివిజన్‌లో అవగాహన కల్పించి, ప్రజలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలను కోరారు.

An eligible voter should not lose their right to vote during the process

ప్రక్రియలో ఏ అర్హత గల ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా ఉండేందుకు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. ప్రతి డివిజన్‌లో ప్రజలకు అవగాహన కల్పించి, అవసరమైన సహాయాన్ని అందించాలని  కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా అధ్యక్షుడు దినేష్ కుల చారి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపీడీ శ్రావంతి రెడ్డి, ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు.

An eligible voter should not lose their right to vote during the process

More articles

Latest article