27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలేషన్ ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఎన్యుమరేషన్ ఫారాలా డిజిటలేషన్ కార్యక్రమం బుధవారం నుండి ప్రారంభించడం జరిగిందని తహసీల్దార్ బాలయ్య వెల్లడించారు. ఈ మేరకు డిజిటలేషన్ లో భాగంగా వివిధ శాఖల నుండి సహకారం అందించాలని ఆయా శాఖల అధికారులతో పాటు స్థానిక సర్పంచులతో కలిసి బిఎల్ఓ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బాలయ్య మాట్లాడుతూ ఎన్యుమరేషన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు డిజిటలైజేషన్ చేయాలని స్థానిక బిఎల్ఓ లను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డిజిటలేషన్ గురించి మాక్లూ తండా, కేకే తండా, నల్లవెల్లి స్టేషన్ తండా, మెగ్య నాయక్ తండా, గన్నారం, గౌరారం, డోన్కల్ గ్రామాలలో బిఎల్ఓ లను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పించారు. తదితరు గ్రామాలలో బిఎల్ఓ లను అప్రమత్త చేస్తూ స్థానిక సర్పంచులకు పంచాయతీ కార్యదర్శులకు భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ శైలజ, ఆయా గ్రామాల సర్పంచులు హేమలత, రోహిత్ గౌడ్, చింతల కిషన్, గణేష్ నాయక్, సంగీత దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

Digitization of enumeration forms begins.

More articles

Latest article