25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

విధి నిర్వహణలో వ్యక్తి మృతి

Must read

📰 Generate e-Paper Clip

 

పిట్లం, బతుకమ్మ :

 

విధి నిర్వహణలో వ్యక్తి మృతి చెందిన సంఘటన పిట్లంలో చోటుచేసుకుంది. పిట్లం మార్కెట్ కమిటీ లో విధులు నిర్వహిస్తున్న బొమ్మల ప్రభాకర్ నిన్న రాత్రి గుండె పోటుతో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. సిబ్బంది, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం విధి నిర్వహణ లో ఉన్న ఉన్న ప్రభాకర్ రాత్రి 11 సమయంలో గుండెపోటుకు గురయ్యారు. దీని విషయమై కుటుంబ సభ్యులకు, సంబంధిత సిబ్బందికి తనకు గుండెలో నొప్పి వస్తున్నదని వారికి సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సిబ్బంది, కుటుంబ సభ్యులు హుటాహుటిన విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్ దగ్గరికి చేరుకొని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సదరు ప్రభాకర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో వెనురిగారు. ప్రభాకర్ కు గతంలో గుండెకు సంబంధించిన వ్యాధి రావడంతో ఆయనకు మూడు నెలల క్రితం స్టంట్ వేయించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు ప్రభాకర్ కుటుంబ సభ్యులకు శాఖా పరంగా వచ్చే బెనిఫిట్ లను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

More articles

Latest article