30.9 C
Hyderabad
Monday, August 3, 2026

భిక్కనూరు పంచాయతీ కార్యదర్శి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Must read

📰 Generate e-Paper Clip

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

భిక్కనూరు గ్రామపంచాయతీ పరిధిలో నేషనల్ హైవే పక్కన సర్వేనెంబర్ 1017 స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ షెడ్డు నిర్మాణం జరుగుతుందని ఆరోపిస్తూ స్థానికులు ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం ఫిర్యాదు చేశారు. గ్రామపంచాయతీ కార్యదర్శి పూర్తి సహకారంతోనే నిర్మాణం జరిగిందని అందే మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై గతంలో పలుమార్లు పంచాయతీ కార్యదర్శి కి, ఎంపీ డి ఓ కు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు తెలిపారు. అధికారులు పట్టించకపోవడంతో ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసి సంబంధిత కార్యదర్శి పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ నిర్మాణాలను వెంటనే అడ్డుకొని నిబంధన ప్రకారం సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టి తగు చర్యలు తీసుకోవాలన్నారు.

More articles

Latest article