27.3 C
Hyderabad
Friday, July 31, 2026

అనుకున్నది సాధించాలంటే అహర్నిశలు కష్టపడాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . వేల్పూర్ ఏపీఎం బత్తుల మాణిక్యం

 

వేల్పూర్ బతుకమ్మ :

 

విద్యార్థి తన జీవితంలో అనుకున్నది సాధించాలంటే అహర్నిశలు కష్టపడాలని వేల్పూర్ ఏపిఎం బత్తుల మాణిక్యం అన్నారు. ప్రతి విద్యార్థి మొదటి నుంచి ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ప్రతిరోజు కష్టపడి చదవాలని పేర్కొన్నారు. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గల కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినిలకు సోమవారం ఐకెపి ఆధ్వర్యంలో కుట్టినటువంటి ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేజీవీబీలో చదువుతున్న మొత్తం 194 మంది విద్యార్థినులకు యూనిఫామ్ పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వినోద, పాఠశాల సిబ్బంది, మండల సమాఖ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article