27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎస్ఐఆర్ ప్రక్రియలో సమన్వయంతో పని చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎస్ఐఆర్ ప్రక్రియకు ప్రతి రెండు డివిజన్‌లకు ఒక సూపర్వైజర్ నియామకం

 

. . . కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వే (ఎస్ఐఆర్) ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ తరపున సమన్వయంతో పనిచేయాలని కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పిలుపునిచ్చారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ) సూపర్వైజర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని 301 పోలింగ్ బూత్‌లకు కాంగ్రెస్ పార్టీ తరఫున బూత్ లెవల్ ఏజెంట్లను ఇప్పటికే నియమించినట్లు తెలిపారు. అలాగే ప్రతి రెండు డివిజన్‌లకు ఒక సూపర్వైజర్‌ను, సుమారు పది బూత్‌ల చొప్పున బాధ్యతలు అప్పగిస్తూ నియమించాలని, అదేవిధంగా నియోజకవర్గానికి ఈఆర్ఓ కోఆర్డినేటర్‌ను నియమించాలని సూచించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వే పేరుతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే కుట్రకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న ఓట్లు తొలగించే ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన బాధ్యత బూత్ లెవల్ ఏజెంట్లపై ఉందన్నారు. ప్రతి ఇంటికి ఎన్యుమరేషన్ ఫారాలు చేరేలా చూడాలని, వాటిని ఎలా పూరించాలో ప్రజలకు వివరించాలని సూచించారు. ఫారాలు నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి అవసరమైన సహాయం అందించాలని కోరారు. బీఎల్‌ఏల ఇన్‌చార్జీలుగా నియమితులైన వారు తమ డివిజన్‌తో పాటు కేటాయించిన ఇతర డివిజన్‌లలో కూడా పర్యవేక్షణ నిర్వహించాలని, ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని బొబ్బిలి రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ, అర్బన్ ఎస్ఐఆర్ కోఆర్డినేటర్ ఆకుల లలిత, కార్పొరేషన్ డీసీసీ ఉపాధ్యక్షులు విజయపాల్ రెడ్డి, సలీం, కోశాధికారి సకినాల శివ, జెండాగుడి చైర్మన్ ప్రమోద్, ప్రధాన కార్యదర్శులు ధర్మారం అవీన్, జిల్లెల రమేష్, సర్దార్ నరేంద్ర సింగ్, హర్షద్, అధికార ప్రతినిధులు గోవర్ధన్, జియా, సీనియర్ నాయకులు ఉబెద్ బిన్ హందన్, కార్యదర్శులు శోభన్, వెంకటేష్, అబ్దుల్ వహీద్, బంటు బలరాం, శ్రీశైలం, ముస్తఫా ఆల్కఫ్, చరణ్, అపర్ణ, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article