25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రామన్నపేటలో విషాదం

 

రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :

 

మండలంలోని రామన్నపేట గ్రామంలో శనివారం సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తిప్పని జలంధర్ – శిరీష దంపతుల రెండేళ్ల కుమార్తె విశ్వైక ప్రమాదవశాత్తు ఇంటి ముందు ఉన్న నీటి సంపులో పడి మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, జలంధర్ – శిరీష దంపతులు వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. అనంతరం తల్లి ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా, చిన్నారి విశ్వైక ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత గమనించిన తండ్రి జలంధర్ వెంటనే చిన్నారిని సంపులో నుంచి బయటకు తీసి చికిత్స కోసం ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిసింది. కళ్ల ముందే రెండేళ్ల కుమార్తెను కోల్పోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపగా, చిన్నారి మృతితో స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు.

More articles

Latest article