28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆనందోత్సాహాలతో బోనాలెత్తిన మహిళలు

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో గత నాలుగు రోజులుగా రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా గౌడ సంఘ సభ్యులు ఇంటి నుండి బోనాలు తీశారు. పోతరాజుల విన్యాసాలు,శివశక్తుల పునకాలతో గౌడ సంఘ సభ్యులు ఆధ్వర్యంలో భక్తులు సాంప్రదాయబద్ధంగా గ్రామంలో బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధులలో జరిగిన ఊరేగింపుకు గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రేణుక ఎల్లమ్మ మందిరం వద్దకు వెళ్లి బోనాలను సమర్పించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి బలిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు, మహిళలు, భక్తులు, పోతరాజులు పాల్గొన్నారు.

More articles

Latest article