నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి
. . . రామన్నపేటలో విషాదం రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ : మండలంలోని రామన్నపేట గ్రామంలో శనివారం సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తిప్పని జలంధర్ - శిరీష దంపతుల రెండేళ్ల కుమార్తె విశ్వైక ప్రమాదవశాత్తు ఇంటి ముందు ఉన్న నీటి సంపులో పడి మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, జలంధర్ - శిరీష దంపతులు వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. అనంతరం తల్లి ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా, చిన్నారి విశ్వైక...