24.7 C
Hyderabad
Monday, August 3, 2026

పవర్ హౌస్ కాంపౌండ్ లో ఎన్పిడిసిఎల్ సిఎండి తనిఖీలు

Must read

📰 Generate e-Paper Clip

 

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు. సిఎండి  శనివారం ఉదయం నిజామాబాద్ పవర్ హౌస్ కాంపౌండ్ లో ప్రత్యక్ష్య మయ్యారు. ఉదయం 7 గంటలకే సాధారణ వ్యక్తి వెళ్లి తనిఖీ చేశారు. ఎవ్వరు సిఎండి ని గుర్తు పట్టకపోవడంతో ఆయన నేరుగా కాంపౌండ్ లోని ఏడి ఈ స్టోర్స్, ఏఈ అవుట్డోర్ ఇండోర్ తో కలిసి స్టోర్ పూర్తిగా తిరిగి తనిఖీ చేశారు. ఆధునిక టెక్నాలజీతో లోడింగ్ అన్లోడింగ్ చేయాలని సూచించారు. పవర్ హౌస్ కాంపౌండ్ లోని డి ఈ ఆపరేషన్ ఆఫీస్ , డి 1 సబ్ స్టేషన్ ను పరిశీలించారు.  విద్యుత్ ఉపకేంద్రం పరిశుభ్రంగా ఉంచుకొని ఆర్ ఎం లో పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు. తదుపరి ఎస్ పి ఎం ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్ ను తనిఖీ చేయడం జరిగింది. ఈ ఈ సివిల్ సివిల్ కు  ఎస్ పి ఎం షెడ్డు , ప్రాంతాన్ని మొత్తం సీసీ తో బాగు చేయవలసిందిగా ఆదేశించారు.

NPDCL CMD at the Power House compound

ఎన్ పిడిసిఎల్ బాస్ రాకతో అధికారుల ఉరుకులు పరుగులు……

సాధారణంగా ఉదయం 10 గంటలు గడిస్తే గాని పవర్ హౌస్ కాంపౌండ్ ముఖం చూడని విద్యుత్ శాఖ ఉద్యోగులు, అధికారులు సీఎండి పర్యటన కారణంగా అప్రమత్తమయ్యారు. శుక్రవారం నుంచి సిఎండి రాక గురించి ఎదురు చూస్తున్న అధికారులు ఆయన ఉదయం వేళ ఒక్కరే వచ్చి తనిఖీలు చేస్తుండటంతో ఒక్కోక్కరు గా అధికారులు పవర్ హౌస్ కు చేరుకున్నారు. అధికారులతో పాటు ఉద్యోగులు సిఎండి పర్యటనతో ముందుగానే రావడం విశేషం. పవర్ హౌస్ కాంపౌండ్ లోని పలు విభాగాల్లో పనిచేసేవారికి  యూనిపాం ఉంటుందా అనే విషయం చాలామందికి తెలియదు. సిఎండి పర్యటన నేపథ్యంలో కొత్తగా యూనిపాం, టోపీలు ధరించిన వారిని చూసి చాలామంది అవాక్కయ్యారు…

NPDCL CMD at the Power House compound

 మొక్కుబడి సమావేశాలకు బిన్నంగా…..

సాధరణంగా నెల రోజులకు రెండు లేదా మూడు నెలలకు ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ లు సర్కిల్ పరిధిలో వార్షిక సమావేశం నిర్వహించడం, సూచనలు , సలహలు చేయడం వరకే పరిమితం అవుతున్నారు. మొక్కు బడి సమావేశాలకు భిన్నంగా ఆలోచన సిఎండి రెండు రోజుల ముందు తన పర్యటన సమాచారం ముందుగానే విద్యుత్ శాఖాధికారులకు ఇచ్చిన ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు. అధికారులు, సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టించి అప్రమత్తంగా ఉన్నారా లేదా అని క్షేత్రస్థాయి పర్యటన తేటతెల్లం చేశారు సిఎండి..టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ కొత్త ఎస్ ఈ ( విద్యుత్ ప్రగతి భవన్ ) కార్యాలయాన్ని సందర్శించి అందరితో మాట్లాడటం జరిగింది. సీఎం డి ప్రతిచోట స్టాఫ్ తో మాట్లాడి వారి యొక్క ఇబ్బందులు  అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు బాగా పని చేయాలని సూచించారు. ఇంజనీర్లు స్టాఫ్ వారికి రావలసిన ప్రమోషన్లు గురించి విన్నవించారు..

NPDCL CMD at the Power House compound

More articles

Latest article