28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉచితంగా రాత పుస్తకాలు పంపిణీ చేసిన తెలుగు పండితుడు

Must read

📰 Generate e-Paper Clip

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

విద్యార్థుల్లో తెలుగు భాషపై ఆసక్తి, రాత నైపుణ్యం, భాషా ప్రావీణ్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ శర్మ రూ.5 వేల విలువైన చూచి రాత పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ శర్మ మాట్లాడుతూ, విద్యార్థుల్లో చక్కటి చేతిరాత అలవాటు పెంపొందించడం, తెలుగు భాషపై అభిమానం కలిగించడం లక్ష్యంగా ఈ పుస్తకాలను అందజేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ రాత నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మునిరుద్దీన్, ప్రసాద్, రాజశేఖర్, రాజనర్సయ్య, రాజేందర్, విజయ్, శ్రీనివాస్, గంగాధర్, గంగా మోహన్, ట్వింకిల్, నరేష్, సబిత తదితరులు పాల్గొని ప్రవీణ్ శర్మ సేవాభావాన్ని అభినందించారు.

More articles

Latest article