30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

నాణ్యమైన విద్య తో పాటు ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందించేందుకు కేంద్రం నిధులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . దేగాం జడ్పీ హై స్కూల్ లో సైన్స్ ల్యాబ్ ప్రారంభించిన ఎంపీ అరవింద్

 అలూర్, బతుకమ్మ:

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య తో పాటు ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే లా కేంద్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు. గురువారం ఆలూరు మండలం దేగం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్‌ఎస్)లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధునిక సైన్స్ ల్యాబ్‌ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ఏడబ్ల్యూబీ (60:40) పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.13.50 లక్షల వ్యయంతో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంలో ఇలాంటి ల్యాబ్‌లు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా గ్రామీణ విద్యార్థులకు కూడా పోటీ ప్రపంచంలో రాణించే అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. విద్యార్థులు సైన్స్ ల్యాబ్‌ను సద్వినియోగం చేసుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

Central funds to provide quality education alongside modern scientific knowledge

వన మహోత్సవం లో మొక్కలు నాటిన ఎంపీ,ఎమ్మెల్యే…

పాఠశాల ఆవరణలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి లు మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో దేగాం గ్రామ సర్పంచ్ ఇట్టిడి లింగారెడ్డి, ఎంపీడీవో ఎం. గంగాధర్, ఎంఈఓ నరేందర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.

Central funds to provide quality education alongside modern scientific knowledge

More articles

Latest article