27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో  కార్మికుల ఆందోళన

Must read

📰 Generate e-Paper Clip

 

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ( ఎఐటియుసి అనుబంధం) ఆధ్వర్యంలో కార్మికులు  నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య, జిల్లా అధ్యక్షుడు పి.సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కళాశాల లో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన టెండర్ కాలపరిమితి ముగిసిన సంవత్సరం అవుతున్న ఇప్పటికీ వేతనాలు పెరగకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని వెంటనే కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడంతో పాటు పిఆర్సి ప్రకటించి కనీస వేతనాలు అమలు చేయాలని, నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని 1000 పడకల కు పెంచాలని, ప్రస్తుతం కార్మికులపై పని భారం పెరుగుతున్నందున కార్మికుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి 23 జాతీయ, పండుగ, ఆర్జిత సెలవులు ఇవ్వాలne డిమాండ్లతో ఈ నెల 9న కోఠిలోని డీఎంఈ కార్యాలయం ముట్టడి ఉన్నదని అప్పటికే సమస్య పరిష్కారం కాకపోతే సమ్మె నిర్వహించక తప్పదని అన్నారు. జిజిహెచ్ ముందు ధర్నా నిర్వహించి  సూపరింటెండెంట్ డా. రాములు కి వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి భాగ్యలక్ష్మి, నాయకులు రాధ కుమార్, స్వరూప, భారతి, కవిత, వెంకటేష్, మరియు శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.

Workers' protest at the Government General Hospital

More articles

Latest article