గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో కార్మికుల ఆందోళన
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ( ఎఐటియుసి అనుబంధం) ఆధ్వర్యంలో కార్మికులు నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య, జిల్లా అధ్యక్షుడు పి.సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కళాశాల లో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన టెండర్ కాలపరిమితి ముగిసిన సంవత్సరం అవుతున్న ఇప్పటికీ వేతనాలు పెరగకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్, ఔట్...