రుద్రూర్, బతుకమ్మ :
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రుద్రూర్ జవహర్ నగర్ కాలనీలో గల ప్రైమరీ పాఠశాలను బుధవారం స్పెషల్ ఆఫీసర్ డీఎం ప్రవీణ్, డీసీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డిలు సందర్శించారు. పాఠశాలలో వంట గది, పాఠశాల ప్రక్కన ఉన్న శిథిలావస్థకు చేరిన భవనాన్ని పరిశీలించారు. పాఠశాల పాత భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిందని ఈ విషయం పై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఉపాధ్యాయులకు సూచించారు. ఆయన వెంట ఎంఈఓ రామ్ సింగ్ తదితరులు ఉన్నారు.
