. . . గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్
రుద్రూర్, బతుకమ్మ :
ప్రజారోగ్యాన్ని కాపాడటంలో వైద్యుల పాత్ర కీలకమని గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ అన్నారు. డాక్టర్స్ డే ను పురస్కరించుకొని రుద్రూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్స్ డే వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ వైద్యాధికారిణి డా.అయోషా సిద్దిఖను శాలువా, పూలమాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజారోగ్యాన్ని కాపాడటంలో వైద్యులు కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వడ్ల నరేష్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
