25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

పాఠశాలలో విద్యార్థులకు అన్నీ సౌకర్యాలు కల్పించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్

 

రుద్రూర్, బతుకమ్మ :

 

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాల, రైతు వేదికను మంగళవారం గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సరైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అదేవిధంగా రైతు వేదికను సందర్శించి రైతు వేదిక పక్కన ఉన్న టాయిలెట్స్ ను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సర్పంచ్ వెంట సెక్రటరీ ప్రేమ్ దాస్, ఎంపీఓ అరవింద్, తదితరులు ఉన్నారు.

More articles

Latest article