29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జూలై 2న నిజామాబాద్‌లో విదేశీ ఉద్యోగ మేళా

 

. . . జిల్లా ఉపాధి అధికారి విజేత వేల్పుల

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లాలోని నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో పాల్గొని భారీ జాబ్ మేళా ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి విజేత వేల్పుల సోమవారం ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ ప్రభుత్వ ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధి కార్యాలయం, నిజామాబాద్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో విదేశీ ఉద్యోగ మేళా, భారీ జాబ్ మేళాను 2026 జూలై 2వ తేదీ (గురువారం) ఉదయం 9.00 గంటలకు జనార్దన్ గార్డెన్స్, వర్ణి చౌరస్తా, నాగారం రోడ్, నిజామాబాద్ లో నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తెలిపారు. ఈ ఉద్యోగ మేళాలో దేశీయ సంస్థలతో పాటు విదేశీ ఉద్యోగాల కోసం టిఓఎంసిఓఎం ద్వారా విదేశీ ఉద్యోగాలు జర్మనీ, న్యూజీలాండ్, ఇజ్రాయెల్, దుబాయ్, కువైట్, ఒమాన్, ఖతర్ -దోహ, మలేషియా తదితర దేశాలలో వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాల కోసం అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయన్నారు. ఇతర దేశాల ఉద్యోగాల కొరకు స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంటుందని, నిరుద్యోగులందరు ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంజినీరింగ్, నిర్మాణ రంగం, హాస్పిటాలిటీ, హెల్త్‌ కేర్, నర్సింగ్, తయారీ పరిశ్రమ, డ్రైవింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, వెల్డింగ్, ఫిట్టర్, మెషినిస్ట్, హౌస్‌కీపింగ్, సెక్యూరిటీ, ఫుడ్ & బెవరేజెస్, రిటైల్, ఇతర విభాగాలలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయన్నారు. విదేశీ ఉద్యోగాల కొరకు జీతం నెలకు 65,000 నుండి 3,80,000 వరకు ఉంటుందన్నారు. లోకల్ ఉద్యోగాలు నిజామాబాద్, ఆర్మూర్, డిచ్ పల్లి, వరంగల్, కరీంనగర్, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రదేశాలలో ఉంటాయని, జీతం 15,000 నుండి 35,000 వరకు ఉంటుందన్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీ.టెక్, ఎం.టెక్, ఎంబీఏ, పీజీ, ఇతర అర్హతలు కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి కోరారు. అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ (ఉన్నవారు), పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు వెంట తీసుకుని ఉదయం 9.00 గంటలకు వేదికకు హాజరు కావాలని సూచించారు. విదేశీ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన అభ్యర్థులకు టిఓఎంసోఎం ద్వారా ఉద్యోగ అవకాశాలతో పాటు అవసరమైన మార్గదర్శకత్వం, కౌన్సెలింగ్, తదుపరి ప్రక్రియపై పూర్తి సమాచారం అందించబడుతుందని తెలిపారు.

More articles

Latest article