. . . సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా.అస్మా అప్షీన్
కామారెడ్డి, బతుకమ్మ :
ఐదు సంవత్సరాల లోపు ఏ చిన్నారి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా తల్లిదండ్రులు పూర్తి సహకారం అందించాలని సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. అస్మా అఫ్షీన్ కోరారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రం తో పాటు భూంపల్లి, జనగాం, లింగంపల్లి, తుక్కుజివాడి, తిమ్మాజివాడి, ఉత్తనూర్, వజ్జపల్లి, వజ్జపల్లి తండా, యాచారం తండా, సజ్జనాయక్ తాండ, పూర్వ నాయక్ తాండ, తగ్గి, కల్వరాల్, పద్మా జీవడి మొడేగం, అడ్లూరు ఎల్లారెడ్డి, మర్కల్, తిరుమన పల్లి, కుప్రియాల్, ధర్మరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా జరిగిందని ఆమె తెలిపారు. మొత్తం 3,044 మంది 5 సంవత్సరాల లోపు చిన్నారులు లక్ష్యంగా ఉండగా, 96.4% కవరేజ్ సాధించి 2,934 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయబడినాయన్నారు. ఈ కార్యక్రమంలో 80 మంది సిబ్బంది (ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, వాలంటీర్లు), 2 సూపర్వైజర్ బృందాలు, 1 మొబైల్ టీమ్, 1 ట్రాన్సిట్ టీమ్ పాల్గొని 19 పోలియో బూత్‌ల ద్వారా సేవలు అందించారన్నారు. బూత్‌లో పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారులను గుర్తించి, రాబోయే 2 రోజుల పాటు ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ నాగరాజు, ఏఎన్ఎమ్ లు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
