30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ధర్నా చౌక్ లో హింధూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన

Must read

📰 Generate e-Paper Clip

హిందూ ఆలయాలు  విగ్రహాలను ధ్వంసం చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ..

ఇటీవల రాష్ట్రంలో హిందూ ఆలయాలు, దేవత మూర్తులను ధ్వంసం చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి తగిన విధంగా శిక్ష విధించాలని బజరంగ్దళ్, విహెచ్ పి నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో వరుస ఘటనలకు నిరసనగా వారి ఆధ్వర్యంలో హిందూ దేవతామూర్తులపై ధ్వంసం చేస్తున్న హిందూ వ్యతిరేక వాదుల దిష్టిబొమ్మ ను దహనం  చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో దేవత మూర్తులపై  మితిమీరుతోందని వీటి పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. పైగా హిందూ దేవత మూర్తులపై ధ్వంసం చేసిన వారిని ప్రభుత్వంతో పాటు పోలీసులు దేవతమూర్తులపై ఆలయాల పై దాడికి దిగినవారు మతిస్థిమితం సరిగాలేదని సర్టిఫికెట్లు ఇవ్వడం సరైనది కాదన్నారు. వైద్యులు ఇవ్వాల్సిన సర్టిఫికెట్ను ఏ విధంగాపోలీసులువారికి మతిస్థిమితం లేదనిచెప్పగలుగుతున్నారని ప్రశ్నించారు.ఇప్పటికైనారాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండాప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

 

More articles

Latest article